: గూగుల్ పై రూ. 23 వేల కోట్ల జరిమానా?


సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పై భారీ జరిమానా పడనుందా? నెటిజన్లు ఏదైనా సెర్చ్ చేస్తే, తమకు అనుకూలమైన కంపెనీల గురించిన వివరాలు ముందు కనిపించేలా గూగుల్ సాఫ్ట్ వేర్ ను మార్చిందని, ప్రత్యర్థి కంపెనీలను దెబ్బతీయడమే గూగుల్ ఉద్దేశమని దాఖలైన కేసులో యూరోపియన్ యూనియన్ కాంపిటేటివ్ కమిషన్ ముందు విచారణ ముగియగా, గూగుల్ కు వ్యతిరేకంగా తీర్పు రానుందని ప్రముఖ వార్తా సంస్థ 'రాయిటర్స్' తెలిపింది. మూడు బిలియన్ యూరోలు (సుమారు రూ. 23 వేల కోట్లు) జరిమానాగా చెల్లించాల్సి రావచ్చని పేర్కొంది. జూన్ మొదటి వారంలో జరిమానాపై తుది నిర్ణయం వస్తుందని అధికారులు చెబుతుండగా, ఆపై సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే అధికారాలపైనా కోత పడుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక విచారణలో భాగంగా సెర్చింజన్ పరిశీలించిన సమయంలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీలపై 10 శాతం జరిమానాగా సుమారు రూ. 2,300 కోట్లు విధించవచ్చని తెలుస్తోంది. కాగా, కాంపిటేషన్ కమిషనర్ మార్గరెట్ సెస్టాగర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, మ్యాప్స్ వంటి స్పెషలైజ్డ్ సెర్చ్ ఆప్షన్స్ లో నూ గూగుల్ పై ఆరోపణలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News