: ప్రమాదవశాత్తూ డ్రయినేజీలో పడ్డ బీజేపీ మహిళా ఎంపీ... మీరూ చూడండి!
అక్రమ కట్టడాలను పరిశీలించేందుకు వెళ్లిన గుజరాత్ బీజేపీ ఎంపీ ప్రమాదవశాత్తూ 10 అడుగుల లోతైన డ్రయినేజ్ గుంతలో పడిపోయారు. జామ్ నగర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యురాలు పూనమ్ బెన్, తన నియోజకవర్గ పరిధిలోని ఓ మురికివాడకు వెళ్లిన సమయంలో ఈ చేదు ఘటన ఆమెకు ఎదురైంది. అక్కడ అధికారులతో మాట్లాడుతున్న వేళ, డ్రయినేజ్ స్లాబ్ కుప్పకూలింది. దాంతో ఆమె సహా అధికారులు సైతం గుంతలో పడిపోయారు. వెంటనే ఆమెను వెలుపలికి తీయగా, ఆమెకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు, కొందరు అధికారులు చికిత్స పొందుతున్నారు. ఆమె డ్రయినేజ్ లో పడిపోవడం వీడియో కెమెరాకు చిక్కగా, అదిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.