: తెలంగాణలో ఆర్టీసీ తొలి సమ్మె సైరన్!


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్టీసీ తొలిసారిగా సమ్మె సైరన్ మోగించింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ యూనియన్ జేఏసీ అధికారులకు సమ్మె నోటీసును అందించింది. ఎంప్లాయీస్‌ యూనియన్, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్లతో పాటు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్, కార్మిక సంఘ్‌, కార్మిక పరిషత్, బహుజన వర్కర్స్‌ యూనియన్ లు సమ్మెలో భాగమవుతున్నట్టు ప్రకటించాయి. వేతన సవరణ తరువాత చెల్లించకుండా మిగిలిపోయిన బకాయిల్లో 50 శాతం మొత్తానికి బాండ్లు ఇవ్వాలని, మిగతా మొత్తం తక్షణం విడుదల చేయాలని, రాష్ట్రం ఏర్పడిన తరువాత పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన ప్రోత్సాహకాలు చెల్లించాలని కొత్త డీఏను, నాలుగేళ్లుగా ఆగిన లీవ్ ఎన్ క్యాష్ మెంట్లను చెల్లించాలని జేఏసీ డిమాండ్ చేసింది. సమస్యలను తక్షణం పరిష్కరించకుంటే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని, నివధిక సమ్మెకు దిగుతామని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేత కె.రాజిరెడ్డి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News