: భారత్.. చాలా పవర్ ఫుల్!


భారతీయులుగా ఇది గర్వించదగ్గ విషయం. ప్రపంచంలో చాలా శక్తిమంతమైన దేశాలలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ రీసెర్చ్ కు చెందిన నిపుణులు, పరిశోధకుల బృందం దేశాల శక్తియుక్తులను అంచనా వేసి వాటి సత్తా ఏంటో వెల్లడించింది. దేశాల శక్తికి సంబంధించి అధ్యయనం జరగడం ఇదే మొదటిది. ఇంధన భద్రత, జనాభా, టెక్నాలజీ సామర్థ్యం, విదేశాలతో సంబంధ, బాంధవ్యాల తీరు, రక్షణలో స్వయం సంపత్తి, ప్రపంచంలో నాయకత్వ పాత్ర మొదలైన అంశాల ఆధారంగా ఒక్కో దేశం సత్తాను లెక్కించి వాటి స్థానమేంటో ఈ బృందం వెల్లడించింది. మొత్తం 27 చాలా శక్తిమంతమైన దేశాలలో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. పొరుగుదేశం చైనాతో మనమెప్పుడూ పోల్చుకుంటాం. మరి ఈ జాబితాలో చైనా రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో సర్వ శక్తిమంతమైన దేశంగా మొదటి స్థానం అమెరికాది అయితే, రెండో స్థానం నిస్సందేహంగా చైనాదే. చైనా భవిష్యత్ ప్రపంచ అగ్రరాజ్యంగా లోగడే విశ్లేషణలు వెలువడిన సంగతి తెలిసిందే. చైనా విదేశీ వ్యవహారాల సత్తాతో పోల్చుకుంటే మనమెంతో వెనుకబడ్డామని అధ్యయనం పేర్కొంది.

  • Loading...

More Telugu News