: ఖైరతాబాదు ఆర్టీఏ ఆఫీసులో కేటీఆర్... డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసిన తెలంగాణ మంత్రి
టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కొద్దిసేపటి క్రితం ఖైరతాబాదులోని ఆర్టీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకే ఆయన ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. మంత్రి హోదాలో ఉన్నా... హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదాగా కార్యాలయానికి వచ్చేసిన కేటీఆర్... తన డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్దేశిత ఫార్మాట్ లో దరఖాస్తును నింపి అధికారులకు అందజేశారు.