: తెలంగాణలో వేడిగాలులు.. ఏపీకి వర్షసూచన
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అయితే ద్రోణి కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వేడిగాలులు వీయనున్నట్లు తెలిపారు. శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రానున్న 48 గంటల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.