: పాలేరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఫైటింగ్!... లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు!
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేటి ఉదయం 7 గంటలకు ప్రశాంతగానే ప్రారంభమైన పోలింగ్... ఆ తర్వాత ఘర్షణ వాతావరణానికి దారి తీసింది. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. మరో ప్రాంతంలో టీఆర్ఎస్, సీపీఎం కార్యకర్తల మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు ప్రాంతాల్లో లాఠీలు ఝుళిపించారు. లాఠీచార్జీ చేసి ఇరు వర్గాల కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు.