: కర్నూలులో వైఎస్ జగన్ జలదీక్ష!... లోటస్ పాండ్ లో హైటెన్షన్!
కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు చేపడుతున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేపట్టనున్న జలదీక్ష హైదరాబాదులోని లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సర్కారు వైఖరిని నిరసిస్తున్న జగన్ తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ లోని ఆయన ఇంటితో పాటు వైసీసీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించాలని తెలంగాణవాదులు నిర్ణయించారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్ కు చేరుకున్నారు. జగన్ ఇల్లు, వైసీపీ కార్యాలయాలకు భారీ భద్రతగా నిలిచారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.