: ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించిన పంజాబ్‌.. బెర్తును ఖ‌రారు చేసుకున్న‌ స‌న్‌రైజ‌ర్స్


ఐపీఎల్-9 సీజ‌న్‌లో భాగంగా నిన్న కింగ్స్ ఎలెవ‌న్‌ పంజాబ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ బ్యాట్స్‌మెన్స్ వార్నర్, శిఖర్‌ ధావన్, దీపక్‌ హుడా, బెన్‌ కట్టింగ్‌, యువరాజ్‌ సింగ్ అద్భుతంగా రాణించ‌డంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న హైద‌రాబాద్ టీమ్.. ప్లే ఆఫ్ బెర్తును ఖ‌రారు చేసుకుంది. మ‌రో వైపు పంజాబ్ ప్లే ఆఫ్ ఆశ‌లు వ‌దులుకుంది. ఐపీఎల్-9లో ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిజ‌ట్టుగా హైద‌రాబాద్ నిలిచింది. ఐపీఎల్‌లో చాలా రోజుల తర్వాత హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ యువ‌రాజ్ చివ‌ర్లో చెల‌రేగి 24 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు చేయ‌డం, హైదరాబాద్‌ను కట్టడి చేయడంలో పంజాబ్‌ బౌలర్లు విఫలం కావ‌డంతో.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ను చిత్తుచేసింది. దీంతో పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానాన్ని నిలబెట్టుకున్న హైద‌రాబాద్ ప్లే ఆఫ్ రేసులో బెర్తును ఖ‌రారు చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో వెన‌క‌బ‌డిపోయిన పంజాబ్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్ర‌మించింది.

  • Loading...

More Telugu News