: మనోరమా దేవికి చుక్కెదురు... ముందస్తు బెయిల్ ను విచారణకు స్వీకరించని కోర్టు!
హత్య చేసిన కొడుకును వెనకేసుకు రావడంతో పాటు, మద్య నిషేధమున్న బీహార్ లో ఇంట్లో విదేశీ బ్రాండ్లకు చెందిన బ్రాందీ, విస్కీ బాటిళ్లను దాచివుంచినందుకు ఎమ్మెల్సీ పదవిని కోల్పోయి, పోలీసు కేసును ఎదుర్కొంటున్న మనోరమా దేవికి కోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను విచారణకు స్వీకరించడం లేదని స్థానిక కోర్టు స్పష్టం చేసింది. ముందు కేసు డైరీని, పూర్తి వివరాలను, ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా పూర్వాపరాలు తెలుసుకోకుండా, యాంటిసిపేటరీ బెయిల్ పై విచారించలేమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అంతకుముందు ఆమె తరఫు న్యాయవాది వాదిస్తూ, తన క్లయింటును కేసులో కావాలనే ఇరికించారని ఆరోపించారు.