: తెలంగాణ 7 జిల్లాలకు రూ.791 కోట్లు... ఏపీ 10 జిల్లాలకు రూ.433 కోట్లేగా?: లెక్కలు తీసిన చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ససేమిరా అంటున్న నరేంద్ర మోదీ సర్కారుతో యుద్ధం చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు సంసిద్ధులవుతున్నట్లు సమాచారం. ఇచ్చిన హామీ కంటే అధికంగానే నిధులిచ్చినా, ప్రత్యేక హోదా ఇంకెందుకంటూ ఓ వైపు బీజేపీ సర్కారు వాదిస్తుంటే... ఆ వాదనలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలో ఫారిన్ టూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన పలు కీలక శాఖల అధికారులతో నిన్న వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల కేటాయింపులో పొరుగు రాష్ట్రాల కంటే ఏపీని కేంద్రం హీనంగా చూస్తున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుగా పెట్టేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్త రాష్ట్రం తెలంగాణలోని 7 జిల్లాలకే రూ.791 కోట్లు కేటాయించిన కేంద్రం... ఏపీలోని 10 జిల్లాలకు కేవలం రూ.433 కోట్లు మాత్రమే విడుదల చేసిన విషయాన్ని ఆయన వెలికితీశారు. కరవు నివారణ చర్యల్లో భాగంగా కేంద్రం వ్యవహరించిన ఈ వైఖరిని ప్రధాని ముందు పెట్టనున్న చంద్రబాబు కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా లెక్కలు తీస్తున్నారు.

  • Loading...

More Telugu News