: ’అమ్మ’ ఓటమే వారి లక్ష్యం!... ఆర్కే నగర్ లో జయపై 44 మంది పోటీ!


తమిళ జనం ‘అమ్మ’గా పిలుచుకునే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితని ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. ఇలా భావించిన వారంతా ఏకంగా ఆమెపై పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. వెరసి చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్య 45కు చేరింది. ఈ జాబితాలో జయ ఓ వైపు నిలవగా... మిగిలిన 44 మంది ఆమె ఓటమి కోరుతూ బరిలోకి దిగినవారే ఉన్నారు. వారిలో తమిళనాడులో తెలుగు భాషా పరిరక్షణ కోసం అలుపెరగని పోరు సాగిస్తున్న కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నారు. మొత్తం 44 మందిని ఢీకొట్టనున్న జయలలిత... ఆ నియోజకవర్గంలో విజయం సాధించడం లాంఛనమే అయినా, మెజారిటీపై భారీ ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News