: నా అందాల కుమార్తెకు స్వాగతం: సురేష్ రైనా


టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్, గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా తండ్రయ్యాడు. తన భార్య ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని రైనా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఆమ్‌ స్టర్‌ డామ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రియాంక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని....పుట్టిన పాపకు 'గ్రేసియా' అని పేరు పెట్టినట్లు రైనా తెలిపాడు. ఈ సందర్భంగా ట్విట్టర్లో 'నా అందాల కూతురుకు స్వాగతం. పాప పుట్టే క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ భారంగా అన్పించినా..ఇప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు' అని ట్వీట్ చేశాడు. కాగా, రైనా 2015 ఏప్రిల్‌ లో బాల్య స్నేహితురాలు ప్రియాంకను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News