: సత్తాచాటిన సన్ రైజర్స్...పంజాబ్ చిత్తు


ఐపీఎల్‌ సీజన్‌ 9 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మొహాలి వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఆమ్లా (96), సాహా (27), గురుకీరత్ (27), మిల్లర్ (20) రాణించడంతో 179 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఓపెనర్ వార్నర్‌ (52), రాణించగా, శిఖర్‌ ధావన్‌ (25), దీపక్‌ హుడా (34), బెన్‌ కట్టింగ్‌ (21) యువరాజ్‌ సింగ్‌ (42) చివర్లో మెరుపులు మెరిపించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్‌ 16 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.

  • Loading...

More Telugu News