: నన్నపనేని వ్యాఖ్యలపై విజయవాడ పోలీసుల మండిపాటు
టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యలపై విజయవాడ పోలీసులు మండిపడుతున్నారు. నన్నపనేని రాజకుమారి ప్రైవేటు పని మీద వచ్చారని పోలీసులు తెలిపారు. సిద్ధార్థ నగర్ లోని వంద కోట్ల విలువైన సివిల్ వ్యవహారంలో ఆమె ఓ వర్గానికి కొమ్ముకాస్తూ వచ్చారని వారు పేర్కొంటున్నారు. నన్నపనేని వ్యాఖ్యలు సరికాదని వారు పేర్కొన్నారు. అన్నదమ్ముల మధ్య సివిల్ వ్యాజ్యం కోర్టులో ఉందని వారు తెలిపారు. విషయం తెలుసుకోకుండా ఆమె మాట్లాడడం సరికాదని వారు హితవు పలికారు. ఆ విషయంలో అవగాహన లేని కొంత మంది పెద్దలు ఈ వివాదంలో కలుగజేసుకుని పోలీసులపై ఒత్తిడి పెంచడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. నన్నపనేని పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.