: జగన్ కి డబ్బున్నవాళ్లంటే మోజు...మమ్మల్ని బయట కూర్చోబెట్టాడు: ఆనం వివేకానంద రెడ్డి
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కి డబ్బున్నవాళ్లంటే మోజని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, జగన్ అహంకారి అని అన్నారు. తాము కాంగ్రెస్ లో ఉండగా, తమను బయట కూర్చోబెట్టి, డబ్బున్నవారిని లోపల కూర్చోబెట్టి మాట్లాడేవారని ఆయన చెప్పారు. జగన్ చాలా అహంకారి అని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా తమ మాటే నెల్లూరులో చెల్లుతుందని ఆయన తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉన్న శాసనసభ్యులు, నాయకుల్లా ఊర్లోవారి కొంపలు నూకే వారము కాదని ఆయన చెప్పారు. అయితే అధికారంలో ఉన్నవారితో విభేదాలు ఎందుకని వారి గురించి చెప్పడం లేదని ఆయన చెప్పారు.