: ఆ చెత్త రూల్ ను ఐపీఎల్ లో అయినా మార్చండి!: స్టీఫెన్ ఫ్లెమింగ్


అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న డక్ వర్త్ లూయిస్ నిబంధనను మార్చాలని ఐపీఎల్ లో పూణే ఫ్రాంఛైజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ డిమాండ్ చేశాడు. న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ నిబంధనను చెత్త నిబంధనగా అభివర్ణించాడు. వర్షం కారణంగా కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిని కనీసం టీ20ల్లో అయినా మినహాయించాలని కోరాడు. డక్ వర్త్ లూయిస్ పద్ధతికి మ్యాచ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే విజేత నిర్ణయమైపోతుందని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. ఇది సరైన విధానం కాదని పేర్కొన్నాడు. ఆటగాళ్లు కష్టపడి ఆడినప్పుడు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించడం సరికాదని తెలిపాడు. రూల్ ను మార్చాలని సూచించాడు.

  • Loading...

More Telugu News