: రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధం...పోలింగ్ కు ముందే ఒక నియోజకవర్గ పోలింగ్ వాయిదా
తమిళనాడులో ఎన్నికల పోలింగ్ కు సర్వం సిధ్ధమైంది. 234 స్థానాల్లో 233 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ పార్టీల నుంచి 3,776 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 5.79 కోట్ల మంది ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అధికారం కోసం అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో నోట్ల వరద పారుతోంది. వివిధ ప్రాంతాల్లో గిఫ్టులతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. మద్యం మత్తులో ఓటర్లను ముంచెత్తుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిఫ్టులు, తాయిలాల కారణంగా అరవకురుచిలో ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. గెలుపుపై డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ధీమాగా ఉన్నాయి.