: కారుకు ఓటేద్దాం!... కేసీఆర్ కు మద్దతిద్దాం!: పాలేరు ఓటర్లకు కేటీఆర్ ట్వీట్!
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. తుది రోజు ప్రచారంలో టీఆర్ఎస్ యువనేత, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ప్రచారం ముగుస్తుందనగా ఆయన పాలేరు ఓటర్లకు ట్విట్టర్ లో ఓ సందేశం పోస్ట్ చేశారు. ‘‘కారుకు ఓటేద్దాం. కేసీఆర్ కు మద్దతిద్దాం’ అంటూ ఆయన ట్వీట్ చేసి ప్రచారం ముగింపులోనూ తనదైన శైలిలో ఓట్లను రాబట్టేందుకు యత్నించారు. మరి ఈ ట్వీట్ కు పాలేరు ఓటర్లు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి.