: తమిళ పార్టీలకు షాకిచ్చిన ఈసీ!... మేనిఫెస్టోల విశ్వసనీయతపై షోకాజ్ నోటీసులు!


తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రచార హోరుకు నిన్నటితో తెరపడింది. అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేతో పాటు ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడ్డ చిన్న పార్టీల కూటమి ప్రచారంలో పోటీ పడ్డాయి. నిన్న సాయంత్రం ప్రచారం ముగుస్తుందనుకున్న తరుణంలో అన్నాడీఎంకేతో పాటు డీఎంకేకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘ఉచిత’ హామీల హోరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలను ఎన్నికల సంఘం ప్రశ్నించింది. లెక్కలేనన్ని ఉచిత పథకాలకు డబ్బులెక్కడి నుంచి తెస్తారో చెప్పాలంటూ ఆ రెండు పార్టీల చీఫ్ లు జయలలిత, కరుణానిధిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది. నేటి సాయంత్రంలోగా ఈ నోటీసులకు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సదరు నోటీసుల్లో ఈసీ ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు డైలమాలో పడ్డాయి. ఈసీ నోటీసులకు జవాబిచ్చే కార్యక్రమాన్ని ఆ పార్టీలు వేగవంతం చేసినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News