: మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం


మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడు, కేరళ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నేటి సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం కేరళలో జరగనున్న ఎన్నికల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, మొత్తం 140 శాసన సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతుండగా, 1,203 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరపున పోటీ పడుతున్నారు. వీరిలో 109 మంది మహిళలు కూడా ఉండడం విశేషం. మరో వైపు పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో సుమారు 5.79 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాట 234 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, వివిధ పార్టీల నుంచి 3,776 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యమంత్రి అభ్యర్థులు జయలలిత, కరుణానిధి, విజయకాంత్, అన్బుమణి రాందాస్ ఉన్నారు. మూడో రాష్ట్రమైన పుదుచ్చేరీలో 9.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ కేవలం 30 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News