: 'బేవాచ్' షూటింగ్ లో ప్రియాంకా చోప్రాకి గాయాలు
'బేవాచ్' హాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా గాయపడింది. 'బేవాచ్' షూటింగ్ లో పాల్గొన్న సందర్భంగా తనకు గాయాలయ్యాయని, 'ఈ గాయాలకు మందులివే' అంటూ ట్వీట్ చేస్తూ, ఓ ఫోటోను కూడా ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ గాయాలు పెద్దవి కాదని స్వల్పగాయాలేనని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ప్రియాంక తెలిపింది. కాగా, 33 ఏళ్ల ప్రియాంక 'బేవాచ్' సినిమాలో విక్టోరియా లీడ్స్ అనే విలన్ పాత్ర పోషిస్తోంది. 2017 మే 19న విడుదల కానున్న 'బేవాచ్' సినిమాలో, టీవీ సిరీస్ లో నటించి అంతులేని క్రేజ్ సంపాదించిన డేవిడ్ హ్యాజెల్ హాఫ్, పమేలా ఆండర్సన్ కూడా ఆయా పాత్రలు పోషించడం విశేషం.