: ఉత్తమ క్రీడా స్పూర్తిని చూపిన రైనా!


గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. తొలి సంతానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైనా, ఈ మ్యాచ్ ఆడకుండా భార్య వద్దకు వెళ్లాడు. అయితే మ్యాచ్ ను ఆన్ లైన్ లో చూసిన రైనా తొలిసారి ఓ అద్భుతమైన ఆటను మిస్సయ్యానని ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌ లోనే ఇది అద్భుతమైన గేమ్ అని పేర్కొన్నాడు. ఏబీ, కోహ్లీ ఇద్దరూ బాగా ఆడారని కితాబునిచ్చాడు. తమ జట్టు ఓటమిపాలైందన్న బాధ ఉన్నప్పటికీ వారిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ను దగ్గర్నుంచి చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సంతానం ఇంకా భూమి మీదకు రాలేదని ట్వీట్ చేసిన రైనా, ఈ ఎదురుచూపులు చాలా భారంగా ఉన్నాయని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News