: నా అభిప్రాయం మారలేదు...నాకు తెలుగు సినీ పరిశ్రమ చాలు: మహేష్ బాబు
ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉందనో లేక మంచి విజయాలు వస్తున్నాయనో తాను నిర్ణయాలు మార్చుకోనని మహేష్ బాబు చెప్పాడు. బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్ సందర్భంగా మాట్లాడుతూ, తాను గతంలో చెప్పిన దానికే కట్టుబడి ఉన్నానని అన్నాడు. తనకు వేరే భాషల సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పాడు. ఇతర భాషా సినిమాల్లోకి వెళ్లి కొంత సమాయాన్ని వేస్టు చేసుకోవాలని భావించడం లేదని అన్నాడు. తనకు తెలుగు పరిశ్రమ అన్నీ ఇచ్చిందని, దీనిని వదలాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. మరేదో భాషలోకి వెళ్లి సినిమా చేసే సమయంలో తెలుగులోనే మరో మంచి సినిమా చేయడం బెటర్ అని అభిప్రాయపడ్డాడు. బ్రహ్మోత్సవం మంచి సినిమా అవుతుందని, అందర్నీ అలరిస్తుందని మహేష్ విశ్వాసం వ్యక్తం చేశాడు. రీమేక్ లలో నటించాల్సిన అవసరం తనకు లేదని చెప్పాడు. తెలుగు రచయితలు మంచి కథలు తెస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తే సరిపోతుందని మహేష్ బాబు తెలిపాడు.