: 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన కోహ్లీ సేన
ఐపీఎల్ సీజన్ 9లో భారీ విజయం నమోదైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అభిమానులను రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు ఆనందంలో ముంచెత్తారు. మ్యాచ్ లో ఆద్యంతం రంజింపజేసిన కోహ్లీ సేన అద్భుతమైన విజయం అందుకుంది. ఈ విజయంతో నాకౌట్ స్టేజ్ లో రేటింగ్ ఆధారంగా స్థానం సంపాదించే దిశగా అడుగులు వేసింది. గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పైచేయి ప్రదర్శించిన బెంగళూరు ఆటగాళ్లు 144 పరుగుల భారీ విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో డివిలియర్స్ (129), విరాట్ కోహ్లీ (109) సెంచరీలు సాధించడంతో 148 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ లో కెప్టెన్ మెక్ కల్లమ్ (11), రవీంద్ర జడేజా (21), ఆరోన్ ఫించ్ (37) జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో 18.4 ఓవర్లలో కేవలం 104 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బెంగళూరు జట్టు 144 పరుగుల భారీ విజయం సాధించింది.