: గౌతమ్, సితారలతో సినిమా చేయాలని నాకూ వుంది... అయితే, అన్నీ కుదరాలిగా!: మహేష్ బాబు


'బ్రహ్మోత్సవం' సినిమా విడుదల ప్రమోషన్ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులతో ఆన్ లైన్ ఛాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని గౌతమ్, సితార(మహేష్ పిల్లలు), మహేష్ బాబు కలిసి నటిస్తే చూడాలని ఉందని అడిగాడు. దీనికి మహేష్ బాబు సమాధానం ఇస్తూ...ఏదయినా మనం అనుకుంటే కుదరదని, దానికది కుదిరితేనే చేయాలని అన్నాడు. గౌతమ్, సితారలతో కలిసి నటించాలని తనకు కూడా ఉందని, అయితే అనుకున్నంత మాత్రాన అది సాధ్యపడదని, అన్నీ కుదిరితే మాత్రం తప్పకుండా చేస్తానని, అంతకంటే తనకు ఆనందం ఏముంటుందని అన్నాడు. అయితే వారిద్దరినీ ఇప్పుడే సినీ పరిశ్రమలోకి తీసుకురావాలన్న కోరిక తనకు లేదని మహేష్ తెలిపాడు. వారిద్దరూ పెద్దయ్యాక నటించాలని అడిగితే, అభ్యంతరం చెప్పనని మహేష్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News