: నాకు వయసైపోతోంది...కోహ్లీ అంత ఫిట్ గా లేను: డివిలియర్స్
తనకు వయసైపోతోందని రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. అతను అలా అన్నప్పుడు పక్కనే ఉన్న కోహ్లీ నవ్వేశాడు. తన ఆటను తన తల్లి చూస్తోందని, అది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఏబీ తెలిపాడు. ఇలా ఆడడంలో ప్రత్యేకత ఏమీ లేదని, ఇన్నింగ్స్ ఆరంభంలో బంతులను అర్థం చేసుకునేందుకు కొంత సమయం పట్టిందని అన్నాడు. తరువాత లయను అందుకున్న అనంతరం ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయిందని ఆయన చెప్పాడు. అయితే తన వయసు 32 ఏళ్లని చెప్పిన డివిలియర్స్, తాను కోహ్లీ అంత ఫిట్ గా లేనని అన్నాడు. దీనికి కోహ్లీ నవ్వేశాడు. ఆటను చూసి ఎవరు ఫిట్టో చెప్పాలని అన్నాడు. కాగా, డివిలియర్స్ కేవలం 52 బంతుల్లో 129 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.