: ఆర్జేడీ అధినేత లాలూకి బీసీ బిల్లు గురించి వివరించాం.. మద్దతు ఇచ్చారు: ఆర్.కృష్ణ‌య్య‌


పార్ల‌మెంటులో బీసీ బిల్లు పెట్టాల‌ని తాము చేస్తున్న ఉద్య‌మానికి రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ మద్దతు తెలిపార‌ని బీసీ సంక్షేమ సంఘం నేత‌, ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య వెల్ల‌డించారు. న్యూఢిల్లీలో మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. లాలూకి బీసీ బిల్లుపై, ఆ వ‌ర్గ‌ప్ర‌జ‌లు ఎదుర్కుంటోన్న స‌మ‌స్య‌ల‌పై వివ‌రించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. బీసీల‌కు రాజ్యాంగ బ‌ద్ధ‌మైన హ‌క్కులు సాధించి తీరుతామ‌ని ఆయ‌న అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీల స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి మద్దతు తెల‌పాల‌ని లాలూని కోరిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News