: ఆ డబ్బు ఎస్బీఐదే: నిర్ధారించిన తమిళ అధికారులు
తమిళనాడులో మూడు కంటెయినర్లతో పట్టుబడిన నగదుపై క్లారిటీ వచ్చింది. 570 కోట్ల రూపాయల నగదుకు పెద్ద సెక్యూరిటీ లేకుండా పంపడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని ఎస్బీఐదిగా గుర్తించామని తమిళనాడు ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తాన్ని సుదూరతీరాలకు పంపేటప్పుడు బ్రాంచ్ మేనేజర్ స్థాయి అధికారి ఉండాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాంటి నిబంధనలేవీ పట్టించుకోకుండా ఇంత పెద్ద మొత్తాన్ని పట్టుకోవడంపై దేశం ఉలిక్కిపడింది. అయితే అది ఎస్బీఐకి చెందినది అని అధికారులు స్పష్టం చేయడంతో దానిపై నెలకొన్న అనుమానాలు తీరాయి.