: మోదీ కేడీ...బీజేపీ ఇప్పుడు నిలువునా మోసం చేసింది!: సీపీఐ రామకృష్ణ
విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు నిలువునా మోసం చేసిందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ కేడీలా ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు. తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామని, ఏపీకి హోదా తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని చెప్పిన విషయం నిజం కాదా? అని ఆయన నిలదీశారు. ఇప్పుడు రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అని అంటున్నారని, దానికి అర్థం ఏంటని ఆయన అడిగారు. ప్రజల్లోకి వెళ్తాము, బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సవాలు చేశారు. బీజేపీ నేతలు మీడియాకు చెప్పిన మాటలను నేరుగా ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడినా సంతోషమేనని ఆయన అన్నారు.