: గన్ మిస్ఫైర్ కాలేదు.. కానిస్టేబులే ఆత్మహత్య చేసుకున్నాడు: పోలీసులు
ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రిలో ఏఆర్ కానిస్టేబుల్ మృతికి కారణం గన్ మిస్ఫైర్ కావడం కాదని, అతనే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన కానిస్టేబుల్ గంగాధర్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఇంటి వద్ద విధులు నిర్వహిస్తోన్న ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ శరీరంలోకి బుల్లెట్లు దిగడంతో గన్ మిస్ ఫైర్ అయిందని భావించారు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు గంగాధర్ అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు.