: ఎంసెట్ మెడికల్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు: గంటా


'నీట్‌' తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌ లో ఎంసెట్‌ రాసిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌ ను నీట్‌ నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేయనున్నామని అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాగానే దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎంసెట్‌ (మెడిసిన్‌) ఫలితాల విడుదలపై కూడా వివరణ ఇస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌ కు అనుగుణంగా సిలబస్‌ రూపొందిస్తామని ఆయన చెప్పారు. ఎంసెట్ మెడికల్ ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News