: మూడు సార్లు కాటేసిందన్న కోపంతో పామును కరకరా కొరికేశాడు!


మూడు సార్లు కాటేసిన పామును అతను కసిదీరా కొరికేసి ప్రాణాలు కోల్పోయిన చిత్రమైన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. లతేహార్ జిల్లాలోని భరియాత్ గ్రామంలో రంతు ఓరన్ (50) అనే వ్యక్తి తన ఇంట్లో నిద్ర పోతున్నాడు. ఇంతలో అతనికి పక్కింట్లోంచి అరుపులు వినిపించాయి. దీంతో ఏం జరిగిందోనన్న ఆందోళనతో వెళ్లి చూడగా పెద్ద నాగుపాము వారింట్లో బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ఆయన దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బుసలు కొడుతున్న కోడెనాగు అతని శరీరంపై మూడు సార్లు కాటేసింది. అంతే, ఓరన్ కు కోపం ముంచుకొచ్చింది. దానిని పట్టుకుని, కసిదీరా నోటితో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాడు. అయితే, పాము కాటుకు గురైన ఓరన్ శరీరంలోకి విషం వ్యాపించడంతో కుప్పకూలిపోయాడు. భయాందోళనలకు గురైన ఓరన్ కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. కాటేసిన పామును కొరికి చంపడం వల్ల శరీరంలోకి ఎక్కిన విషం విరిగిపోతుందని జార్ఖండ్ లోని గిరిజనుల నమ్మకం.

  • Loading...

More Telugu News