: చిరంజీవి 150 సినిమాకు తొలి రోజు పని మొదలైంది: దేవిశ్రీ ప్రసాద్


ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన చిరంజీవి 150వ చిత్రం 'కత్తిలాంటోడు' ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తొలి రోజు డిస్కషన్స్ కు చిరంజీవి కూడా రావడంతో ఆయనతో ఓ చిత్రాన్ని దిగి పోస్టు చేశారు. "తొలి రోజు డిస్కషన్స్... బాస్ తో ఉన్నాను. వెల్ కం బ్యాక్ సర్! వుయ్ లవ్ యూ" అంటూ కీబోర్డ్, లవ్, లాఫ్ ఎమోజీలతో ట్వీట్ పెట్టాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన కత్తి చిత్రానికి రీమేక్ గా రూపొందుతుందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News