: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసిన ఐశ్వర్యరాయ్
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ సందడి చేసింది. కేన్స్‌లో జరుగుతోన్న ఈ వేడుకలో గోల్డ్ కలర్ డ్రెస్‌లో కనిపించిన ఐశ్వర్య ఆహూతులను ఆకర్షించింది. ఎర్రతివాచీపై ఆమె చేసిన వాక్ చూపరులను కళ్లు తిప్పుకోనీయకుండా చేసింది. ఆమె అందాన్ని తమ కెమెరాల్లో బంధించుకోవడానికి అక్కడి ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఐస్ ధరించిన గోల్డ్ కేప్ గౌన్ ఆమె అందాన్ని మరింత పెంచేసింది. కువైట్‌కు చెందిన డిజైనర్ అలీ యోనస్ ఈ డ్రెస్‌ను ఐష్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. కేన్స్ ఉత్సవాల్లో ఇప్పటికే పదిహేనుసార్లు పాల్గొని అక్కడి వారిని అలరించిన ఐష్ తాజాగా మరోసారి ఈ వేడుకలకు హాజరైంది.