: కేసీఆర్ ఒక్క సైన్ చేస్తే, చంద్రబాబు కటకటాల వెనక్కి: రఘువీరా సంచలన వ్యాఖ్య


ఓటుకు నోటు కేసులో ముందడుగు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సంతకం చేస్తే, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసులకు భయపడే, తెలంగాణ ప్రాజెక్టులకు బాబు అడ్డు చెప్పడం లేదని దుయ్యబట్టారు. బాబు అసమర్థతను అలుసుగా తీసుకుని తెలంగాణలో అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలసి పోరాటం చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News