: బీజేపీకి గుడ్‌బై.. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న నాగం జనార్దన్ రెడ్డి !
భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ అధిష్ఠానం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఇక ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలమైన రాజకీయ వేదికగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ జీవితం ఆరంభించిన నాటి నుంచి టీడీపీలో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి 2011లో ఆ పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించడంతో.. తెలుగు దేశం పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. తాజాగా బీజేపీ అధిష్ఠానం తీరుపై అలిగిన నాగం జనార్దన్ రెడ్డి ఇక హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు.