: పుర్రెగుర్తులు, ఎగుమతులు అన్నీ కుంటిసాకులే: పొగాకు వ్యాపారులపై మండిపడ్డ ఏపీ మంత్రి ప్రత్తిపాటి


సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పుర్రెగుర్తులు పెద్దవయ్యాయన్న కారణంగా అమ్మకాలు తగ్గుతున్నాయని, ఎగుమతులు క్షీణిస్తున్నాయని కుంటిసాకులు చెప్పవద్దని పొగాకు వ్యాపారులపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదని, ప్రభుత్వ విధానాల కారణంగా నష్టపోతున్నామని నిరసన తెలుపుతున్న ఒంగోలు పొగాకు వేలం కేంద్రాన్ని ఈ ఉదయం ఆయన సందర్శించారు. రైతుల సమస్యలు తనకు తెలుసునని, వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాల్సి వుందని అన్నారు. వ్యాపారులు సిండికేట్ అయ్యారని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించిన ఆయన, వ్యాపారుల వైఖరిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. పిచ్చి కారణాలు చెబుతూ రైతుల నుంచి కొనుగోళ్లను నిలిపితే ప్రభుత్వం రంగంలోకి దిగాల్సి వస్తుందని అన్నారు. ఏవైనా న్యాయపరమైన సమస్యలుంటే, తమ దృష్టికి తీసుకురావాలని వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News