: తమిళనాట దొరికిన వందల కోట్లపై స్పందించిన హీరో విశాల్
ఈ ఉదయం తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలో కోట్ల విలువైన డబ్బు పట్టుబడడంపై తమిళ హీరో, నడిగర సంఘం నేత విశాల్ స్పందించాడు. "తిరుపూరులో ఏ విధమైన డాక్యుమెంట్లూ లేకుండా రూ. 570 కోట్లు లభించాయా? అయితే, ఈ డబ్బును చిన్నారుల విద్య, మధ్యాహ్న భోజన పధకాలకు వినియోగించండి. చిన్నారులకు ఈ మొత్తం సరిపోతుంది" అని సామాజిక మాధ్యమ వెబ్ సైట్ ట్విట్టర్ లోని తన ఖాతాలో సలహా ఇచ్చాడు.