: కానిస్టేబుల్ పై దాడి కేసులో కన్నడ హీరోయిన్ మైత్రేయకు రెండేళ్ల జైలు శిక్ష
ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నందుకు అడ్డగించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను దుర్భాషలాడటమే కాకుండా, చెయ్యి చేసుకున్న కన్నడ నటి మైత్రేయ గౌడకు రెండేళ్ల జైలు శిక్ష పడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2001లో మైత్రేయ తన స్నేహితులు సుప్రియ, రేఖ, రూపలతో కలిసి కారులో వెళ్తూ, డ్రైవింగ్ చేస్తోంది. ఆమె సెల్ ఫోన్ మాట్లాడటాన్ని చూసిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివకుమార్ ఆమెను ఆపారు. అప్పుడు వీరు నలుగురూ అతనిపై దాడి చేసి కొట్టారు. కేసును విచారించిన న్యాయస్థానం మైత్రేయకు రెండేళ్లు, మిగిలిన వారికి ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది. ఆపై పై కోర్టులో అపీలు చేసుకునే అవకాశాన్ని ఇస్తూ బెయిల్ కూడా ఇచ్చింది.