: హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తున్నవారికి చెమటలు పట్టిస్తోన్న పోలీసులు.. 47 మంది అరెస్ట్
హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న వారిని పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. తాగి వాహనాలు నడుపుతోన్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తోన్నా భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు. ఈరోజు బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టపగలే 42మంది పోలీసులకి పట్టుబడ్డారు. 16కార్లు, 20కిపైగా ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డవారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.