: మానస సరోవరం వద్ద తెలుగు భక్తుల తీవ్ర అవస్థలు


సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉంటాడని భక్తులు నమ్మే కైలాస మానస సరోవరం వద్ద గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండకు చెందిన భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నట్టు తెలుస్తోంది. వారు అక్కడికి వెళ్లిన తరువాత వాతావరణం మారిపోగా విపరీతమైన చలిలో చిక్కుకుని వారు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కైలాస శిఖరాన్ని దర్శించుకోవాలన్న కోరికతో హెలికాప్టర్ ను మాట్లాడుకోగా, దాని టేకాఫ్ రెండు రోజుల నుంచి వాయిదా పడుతున్నట్టు, అక్కడున్న భక్తుల నుంచి సమాచారం లభించింది. మరోవైపు వెనక్కు వచ్చే మార్గం కూడా లేక వారు పెను అవస్థలు పడుతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలతో ఇంతదూరం వచ్చి కైలాస శిఖరాన్ని దర్శించుకోకుండా వెళ్లేందుకు మనస్కరించడం లేదని, శిఖర దర్శనం సేవలందిస్తున్న హెలికాప్టర్ లు సైతం ఆగిపోయాయని ఓ భక్తుడు వివరించాడు.

  • Loading...

More Telugu News