: రిలయన్స్ గ్రూప్ లో పనిచేస్తున్న వారెవరైనా తెలుసా?... మీకో బంపరాఫర్ ఇది!


రిలయన్స్ గ్రూప్ సంస్థల్లో దేనిలోనైనా మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? మీ స్నేహితులకు స్నేహితుడు ఎవరైనా పని చేస్తున్నారా? అయితే, మీకు ఓ మంచి బంపరాఫర్ ఇది. రిలయన్స్ ఉద్యోగి నుంచి మీరు ఒక ఎస్ఎంఎస్ తెప్పించుకోగలిగితే, రూ. 4,799కి ఓ 4జీ స్మార్ట్ ఫోన్ తో పాటు మూడు నెలల అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను మీరు అందుకోవచ్చు. ప్రస్తుతం తామందిస్తున్న లైఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలను మరింతగా పెంచుకోవడానికి రిలయన్స్ వేసిన కొత్త ప్లాన్ ఇది. ఒక్కో ఉద్యోగి 10 మంది స్నేహితులకు ఎస్ఎంఎస్ పంపి ఈ సౌకర్యాన్ని దగ్గర చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ ఎస్ఎంఎస్ అందుకున్న వారికి మాత్రమే 4జీ సిమ్ లభిస్తుంది. కాగా, లైఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు సమీప భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతాయని, ఈ సంవత్సరంలోనే 7 శాతం మార్కెట్ వాటాతో పాటు బిలియన్ డాలర్ బ్రాండ్ గా లైఫ్ అవతరిస్తుందని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేస్తోంది. 2016-17లో కోటి యూనిట్ల వరకూ లైఫ్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల విక్రయం సాధ్యమేనని పేర్కొంది. రూ. 4,799లో లోయర్ ఎండ్, రూ. 19,499 ధరలో హయ్యర్ ఎండ్ ఫోన్లను లైఫ్ బ్రాండ్ లో భాగంగా రిలయన్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పెరిగే అమ్మకాలతో ఈ సంవత్సరం రిలయన్స్ రిటైల్ ఆధాయం 31 శాతం పెరిగి రూ. 21,600 కోట్లకు చేరనుందని కూడా సీఎల్ఎస్ఏ అంచనా వేసింది.

  • Loading...

More Telugu News