: మనది గుడ్డి న్యాయం... ఓ అమ్మాయి చెప్పిందని ఎందరిని వేధిస్తారు?: ఆశారాం బాపూ


ఇండియాలో న్యాయం గుడ్డిదని, ఎవరినైనా జైలుకు పంపుతుందని వ్యాఖ్యానించిన స్వయం ప్రకటిత దైవం ఆశారాం బాపూ, ఓ అమ్మాయి చెప్పిందన్న సాకుతో ఎంతమందిని వేధిస్తారని ప్రశ్నించారు. ఆయనపై ఉన్న కేసుల విచారణ జోధ్ పూర్ కోర్టులో సాగుతుండగా, కోర్టుకు హాజరైన ఆయన, తనకు డజనుకు పైగా వ్యాధులున్నాయని, వాటికి చికిత్సలు తీసుకోవాల్సి వుందని అన్నారు. తనకు మీడియాతో మాట్లాడాలని వుందని, కానీ మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. చింద్వారాలో ఆశారాం నిర్వహిస్తున్న గురుకుల్ లో ఓ టీనేజ్ బాలిక, తనపై ఆశారాం అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన ఆశారాం ఆగస్టు 31, 2013 నుంచి జైల్లో కాలం గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News