: పనామా ఎఫెక్ట్... బాబు సూచన మేరకు హెరిటేజ్ కు మోటపర్తి రాజీనామా
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టరుగా ఉన్న మోటపర్తి వెంకట శివరామప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల విడుదలైన పనామా పత్రాల్లో మోటపర్తి విదేశాల్లో అక్రమంగా నగదు దాచుకున్నట్టు వెల్లడైన నేపథ్యంలో, యాజమాన్యం సూచన మేరకు ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ప్రకారం సంస్థలో ఓ వ్యక్తిని స్వతంత్ర డైరెక్టరుగా నియమించాల్సి వుంది. దీంతో పలుదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న మోటపర్తిని చంద్రబాబు ఎంచుకోగా, ఆయన విదేశాల్లో కంపెనీలు పెట్టి, ఇండియాలో పన్నులు కట్టకుండా అక్కడికి నిధులు తరలించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, పనామా పేపర్స్ లో పేరు వచ్చిన తరువాత మోటపర్తి రాజీనామా చేయడం గమనార్హం.