: సీఎం స్వయంగా కండువాలు కప్పుతుంటే స్పీకర్ ఏం చేస్తారు?: మాజీ స్పీకర్ నాదెండ్ల నిర్వేదం
నేటి రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలు నశిస్తున్నాయని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, కండువాలు కప్పుతుంటే, ఆయన కనుసన్నల్లోనే మెదలుతుండే స్పీకర్లు ఏం చర్య తీసుకోగలరని ఆయన ప్రశ్నించారు. పితృవియోగంతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత సతీష్ వర్మను పరామర్శించేందుకు విశాఖపట్నం జిల్లా చీడికాడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తాను స్పీకర్ గా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేపై పిటిషన్ ఇచ్చిన 24 గంటల్లో స్పందించి, నోటీస్ ఇచ్చే వాడినని, మూడు వారాల్లో సభ్యుడిపై వేటు పడేదని గుర్తు చేసుకున్నారు. బాబు తీరుతో రాజ్యాంగాన్ని నమ్మాలో, పార్టీని నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.