: ఎవరు ఎవరిని నిద్రపుచ్చారో చెప్పండి?: సమంత గురించి ఆమె స్నేహితురాలు అడిగిన ప్రశ్న
టాలీవుడ్ అగ్రనటి సమంత గురించి సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేసిన ఆమె స్నేహితురాలు నీరజ కోన ఆమె అభిమానులను ఓ ప్రశ్న వేశారు. పిల్లలంటే అమితమైన అభిమానం చూపించే సమంత, నీరజ కోన కుమారుడితో కలిసి ఆడుకుంది. ఆ క్రమంలో ఇద్దరూ నిద్రపోయారు. అయితే, ఎవరు ఎవరిని నిద్రపుచ్చారన్నదే అసలు ప్రశ్న...ఇంతకీ ఎవరు ఎవరిని నిద్రపుచ్చారంటారు? అంటూ అభిమానులను నీరజ ప్రశ్నించింది. దీనికి ఆమె అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. కామెంట్లు, లైకులు, షేర్లతో సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు.