: ప్రత్యేక హోదా ఇవ్వడానికి చట్టంతో పని లేదు: రఘువీరా రెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు చట్టం చేయాల్సిన అవసరం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ‘కరవు-రైతు’ యాత్రలో భాగంగా విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, చట్టంలో లేనందున ప్రత్యేకహోదా ఇవ్వలేమని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థనాథ్‌ సింగ్‌ అంటున్నారని, నిజానికి గతంలో ప్రత్యేకహోదా కల్పించిన 11 రాష్ట్రాలకు చట్టం చేయకుండానే ఆ హోదాను కల్పించారని ఆయన గుర్తుచేశారు. కేవలం క్యాబినెట్‌ నిర్ణయంతో రాష్ట్రానికి ప్రత్యేకహోదా అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. ప్రజలను మభ్యపెడుతున్న పార్టీలకు వారే బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News