: షూటింగ్ లో నా దుస్తులు విప్పించారు: దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు
సినిమా షూటింగ్ లో తన దుస్తులు విప్పించారని మలయాళ దర్శకుడు స్నేహజిత్ పై హీరోయిన్ ఫిర్యాదు చేసింది. స్నేహజిత్ దర్శకత్వంలో కేరళలోని తొడుపుళ ప్రాంతంలో 'దైవం సాక్షి' అనే సినిమా రూపుదిద్దుకుంటోందని, అయితే షూటింగ్ సందర్భంగా అందరి ముందు దర్శకుడు తన దుస్తులు విప్పించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. తను ముందుగా ఈ సినిమా స్క్రిప్టు చదివానని, అందులో ఇలాంటి సీన్ లేదని, అయితే షూట్ సందర్భంగా సీన్ చేయాల్సిందేని దర్శకుడు చెప్పాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఆమె తొడుపుళ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కళియార్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.