: షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ నటుడు ఓంపురి
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. షూటింగ్ లో భాగంగా పరిగెత్తుతున్న సమయంలో కాంక్రీట్ ఫ్లోర్ పై నుంచి తాను జారిపడ్డానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తన మోచేతికి దెబ్బ తగిలిందని, వైద్యులు సర్జరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్నిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని ఓంపురి పేర్కొన్నారు. 1976లో మరాఠీ చిత్రం ద్వారా చిత్రరంగానికి ఆయన పరిచయమయ్యారు. సద్గతి, అర్థ్ సత్య, మిర్చ్ మసాలా, ధార్వి వంటి ఆర్ట్ ఫిల్మ్ ల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆక్రోష్, డిస్కో డ్యాన్సర్, మాచిస్, గుప్త్, ధూప్ తదితర చిత్రాల్లో నటించిన ఓంపురి జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు.